ఆర్డీఎస్ రైతుల్లో చిగురించిన ఆశలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:20 PM
ఆర్డీఎస్ ఆయకట్టుదారుల్లో ఆశలు చిగురించాయి.

అయిజ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్ ఆయకట్టుదారుల్లో ఆశలు చిగురించాయి. సాగునీరు లేక చేతికొచ్చిన పంట చేజారుతుందనుకున్న తరుణంలో సాగునీరు రావడంతో ఆయకట్టుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్‌లో తన వాటా కింద పెట్టుకున్న ఇండెంట్ నీరు తెలంగాణ రైతులకు ప్రాణం పోశాయి. తెలంగాణ సరిహద్దులోని సింధనూర్, రాజపూర్, పులికల్, ఉప్పలతో పాటు దాదాపు 20 వేల ఎకరాలలో వరి పంట సాగుచేశారు. ముందు వేసిన పం టలు చివరి దశలో బయటపడ్డాయి. చివరిలో ఉన్న దాదాపు 12 వేల ఎకరాల వరికి మాత్రం రెండు తడుల నీరు అందితే రైతులు గట్టేక్కేవీలుంది. వరి పంటను కాపాడుకునేందుకు రైతు లు నానా తంటాలు పడ్డారు. చివరికి పంటపై ఆశలు వదులుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా తాగునీటి కింద 2 టీఎంసీలు వదలాలని ఇండెంట్ పెట్టా రు. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి గత నెల 29వ తేదీన నీటిని వదలటంతో అవి ప్రధాన ఆనకట్టకు చేరుకుని అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా ప్రవహించి శనివారం తెల్లవారు జామున తెలంగాణ సరిహద్దు అ యిన 12ఏ డిస్ట్ర్యిబ్యూటర్ సింధనూర్ ప్రాంతం లోకి చేరుకున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలోని ప్రధాన కాలువ షట్టర్ల దగ్గర 4 ఫీట్ల వరకు నీరు ఉంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో 3 ఫీట్ల ఎత్తులో కాలువలో నీరు దిగువకు ప్ర వహిస్తోంది. ఈ నీరు 2 లేదా 3 రోజులు కా లువలో ప్రవహించే అవకాశం ఉండటంతో ఆర్డీఎస్ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.