నర్సయ్య జీవితం ఆదర్శనీయం
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:22 PM
దశాబ్దాల పాటు ప్రజా సేవకే అంకితమైన నాయకుడు, నిరాడంబరుడు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ఆదర్శనీయమని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి
- సీఎన్‌ఆర్ జీవన సాఫల్య పురస్కార ప్రదానం
నాగర్‌కర్నూల్ టౌన్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల పాటు ప్రజా సేవకే అంకితమైన నాయకుడు, నిరాడంబరుడు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ఆదర్శనీయమని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారానికి గుమ్మడి నర్సయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల పంక్షన్‌హాలులో సీఎన్‌ఆర్ చారి టబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టు చైర్మన్ సి.భాస్కర్‌రావు దంపతుల తో కలిసి గుమ్మడి నర్సయ్యకు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ.25 వేలు అం దించి, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన గుమ్మడి నర్సయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. తన రాజకీయ జీవితానికి మొదటి దశలో దివంగత సి.నారాయణరావు కు టుంబం అండగా నిలిచిందన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరుతో పురస్కారం అందించిన సి.భాస్కర్‌రావును అభినందించారు. గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పేదల కోసం తాను చేసిన సేవలను గుర్తించి సీ ఎన్‌ఆర్ చారిటబుల్ ట్రస్టు పురస్కారం అందించడం సంతోషదాయకమ న్నారు. నేటి సమాజంలో కమ్యూనిజానికి ఆదరణ తగ్గిందని బాధ పడొద్దని, పేదల కోసం పని చేస్తూ, అదే లక్ష్యంతో ముందుకు సాగితే ఏదో ఒక రోజు సమ సమాజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు ఆనంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.గీత, టీయూసీఐ ఉపాధ్య క్షురాలు ఎస్.ఎల్.పద్మ, గుమ్మడి నర్సయ్య కుమార్తె ప్రొఫెసర్ అనూరాధ, ప్రజాపంథా నాయకుడు కృష్ణ, డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే, డాక్టర్ నూర్జ హాన్, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగవరం బాల్‌రాం, డాక్టర్ రాంకిషన్, సమన్వ యకర్తలు వనపట్ల సుబ్బయ్య, కంది కొండ మోహన్, కల్వకోలు మద్దిలేటి, పి.వహీద్‌ఖాన్, ఎదిరేపల్లి కాశన్న, ముచ్చర్ల దినకర్, వెంకటపతి, నర్సింహా రెడ్డి, కాశీదాసు, అర్కల రాజేశ్, విష్ణు మూర్తి, గాయకుడు సత్తార్, గుడిపల్లి నిరంజన్, వెంకటేశ్, చంద్రకళ, కవిత, ఫసియొద్దీన్, గౌస్ పాల్గొన్నారు.