నిర్వహణ నాస్తి!
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:39 AM
యువతతో పాటు సాధారణ ప్రజలను వ్యాయామంపై అవగాహన పెంచడంతో పాటు వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన ఓపెన జిమ్‌లు నిరుపయోగంగా మారిపోతున్నాయి.

నిర్వహణ నాస్తి!
నిరుపయోగంగా ఓపెన జిమ్‌లు
అసౌకర్యాలు, అరకొర పరికరాలతో ఇబ్బందులు
రూ. లక్షల ప్రజాధనం వృథా
నల్లగొండటౌన, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): యువతతో పాటు సాధారణ ప్రజలను వ్యాయామంపై అవగాహన పెంచడంతో పాటు వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన ఓపెన జిమ్‌లు నిరుపయోగంగా మారిపోతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా.. పరికరాలు తుప్పుపట్టి విరిగిపోతున్నాయి. పరికరాల్లో కూడా బేరింగ్స్ గ్రీజు, ఆయిల్ వంటివి వేయకపోవడం సరిగా పనిచేయడం లేదు. ఇక కొన్ని చోట్ల పరికరాలు దొంగల పాలవుతుంటే, ఇంకొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు ఓపెన జిమ్‌లు అడ్డాలుగా మారుతున్నాయి. లైట్లు, టా యిలెట్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో జనం ఓపెన జిమ్‌ల వైపు రాని పరిస్థితి ఏర్పడింది.
అధునాతన పరికరాలతో...
ఓపెన జిమ్‌లో ఒక్కో చోట రూ.12 నుంచి రూ.30 లక్షల వరకు వె చ్చించి అధునాతన వ్యాయామ పరికరాలను అమర్చారు. పలుచోట్ల ఖరీదైన పరికరాలను ఏర్పాటు చేశారు. అబ్జామినల్ రైడర్, వర్టికల్ షోల్డర్ పుల్, లెగ్ ఎక్స్టెన్షన, కర్ల్ మిషన్లు, షోల్డర్ ట్విస్టర్లు, పుల్ చైర్స్, చెస్ట్ పుష్ మిషన్లు వంటివి అమర్చారు. కొత్తలో యువకులతో పాటు నడి వయస్కులు, మహిళలు ఓపెన జిమ్‌కు వచ్చినా తర్వాత వాటి నిర్వహణ లో పం, యంత్రాలు పాడైపోవడంతో వారిలో ఆసక్తి తగ్గిపోయింది. దీంతో చాలా చోట్ల ఓపెన జిమ్‌లు పిల్లల ఆట స్థలాలుగా మారాయి.
నిర్వహణ బాధ్యత అంతంతే...
జిమ్ పరికరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టులో పేర్కొన్న నిబంధనలను ప్ర కారం పరికరాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లే ఐదేళ్ల వరకు నిర్వహణను కూడా చూడాల్సి ఉంది. పరికరాలు పాడైనా, తుప్పు పట్టినా సదరు కాంట్రాక్టరే కొత్తవి ఏర్పాటు చేయడమో, బాగు చేయడమో చేయాలి. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఇది జరిగిన దాఖలాలు లేవు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఓపెన జిమ్ మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోతున్నాయి. ఓపెన జిమ్‌ను స్థానిక యువత, అసోసియేషన్లకు గానీ అప్పగిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా తీసుకున్న చర్యలు లేవు.
చెడిపోతున్న పరికరాలు...
పట్టణంలోని గొల్లగూడ, ఫ్లైఓవర్ కింద, శివాజీనగర్ తదితర ప్రాం తాల్లో పరికరాలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల జిమ్‌ల నిర్వహణ లేక పరికరాలు చెడిపోతున్నాయి. జిమ్ రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఏర్పాటు చేసిన ఓపెన జిములకు చాలామంది వస్తున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేక పరికరాలు దెబ్బతింటున్నాయి. కొన్నిచోట్ల లైట్లు, టాయిలెట్ల లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దశలవారీగా అన్ని పట్టణాల్లో ఏర్పాటు
వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్ జిమ్‌కు వెళ్లలేని వారికి ప్ర యోజనం కలిగేలా రాష్ట్రంలో 2018లో ఓపెన జిమ్‌లను అన్ని పట్టణాల్లో ఏర్పాటు జిమ్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణా ల్లో ఉన్న పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ప్రాంతాల్లో ఓపెన జిమ్‌లను ఏ ర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటిలో పరికరాల ఏర్పాటు, నిర్వహణను పూర్తిగా మునిసిపాలిటీలకే అప్పగించారు. మునిసిపాలిటీలు సివిల్ వర్క్స్, టైల్స్ వంటివి సిద్ధం చేస్తే కాంట్రాక్టర్లు వ్యాయామ పరికరాలు అమర్చారు.పట్టించుకునే వారే కరువయ్యారు
భారీ ఖర్చుతో ఓపెన జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని పట్టించుకునే వారు లే రు. జిమ్ పరికరాలు పాడైపోతున్నాయి. వెంటనే మరమ్మతులు చేయించాలి. కొన్నింటికి తరచూ గ్రీసు రాయాలి. ఈ క్రమంలో వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సరిచేయాల్సిన బాధ్యత మునిసి పాలిటీలకు ఉంటుంది. అందుకు అవసరమైన నిధులు పురపాలక సంఘాల సాధారణ నిధుల నుంచి వెచ్చించాలి.
జె. పురుషోత్తం, నల్లగొండ
పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది
ఓపెన జిమ్‌ల నిర్వాహణపై మునిసిప ల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ జిమ్‌లను దశల వారీగా 2018 నుంచి ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సిన సద రు కాంట్రాక్టర్లకు కొన్ని చోట్ల మెయింటెనెన్స గడువు ముగిసిపోవడంతో మేజర్‌గా ఇ బ్బందులు ఉన్న చోట తామే మరమ్మతులు చేయిస్తున్నాం. చిన్న స మస్యలైన గ్రీజు, ఇతరత్రా చిన్నచిన్న సమస్యలను సంబంధిత కాలనీ, వార్డు వాసులను నిర్వహించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
సయ్యద్ ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్