Share News

అసంతృప్తి నిజమే: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ABN , Publish Date - Mar 26 , 2025 | 06:30 AM

ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శాసన మండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, పదవులతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని ఆయన అన్నారు.

అసంతృప్తి నిజమే: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై అసంతృప్తి నిజమేనని శాసన మండలి సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరికైనా పదవి రాకపోతే అసంతృప్తి ఉండడం సహజమేనని, అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. ఈ నెల 29తో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో విలేకరుల ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.

Updated Date - Mar 26 , 2025 | 06:31 AM