Share News

KKR vs RR Riyan Parag: పరాగ్‌ను తిడుతున్న ఫ్యాన్స్.. చేయని తప్పునకు..

ABN , Publish Date - Mar 27 , 2025 | 10:29 AM

IPL 2025: ఐపీఎల్-2025లో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ పరాజయం పాలైంది. అయితే మ్యాచ్ కంటే కూడా రియాన్ పరాగ్ అంశమే ఇప్పుడు హైలైట్ అవుతోంది.

KKR vs RR Riyan Parag: పరాగ్‌ను తిడుతున్న ఫ్యాన్స్.. చేయని తప్పునకు..
Riyan Parag

ఐపీఎల్-2025లో బోణీ కొట్టడంలో మరోమారు విఫలమైంది రాజస్థాన్ రాయల్స్. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడిన ఆర్ఆర్.. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవం మూటగట్టుకుంది. 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది పరాగ్ సేన. దీంతో పాయింట్ల టేబుల్‌లో ఆఖరి స్థానానికి పడిపోయింది రాజస్థాన్. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే కూడా ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు ఓ అభిమాని దండం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అతడిపై నెట్టింట భారీగా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


ఒక్కసారిగా దూసుకొచ్చి..

కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో పరాగ్ బౌలింగ్ చేస్తుండగా హఠాత్తుగా మైదానంలోకి ఓ అభిమాని వచ్చాడు. ఫెన్సింగ్ దూకి, సెక్యూరిటీని దాటేసి మరీ గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ లాంటి స్టార్లు లేరు.. మరి, అతడు ఎవరి కోసం వస్తున్నాడని అంతా ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆ అభిమాని.. పరాగ్ దగ్గరకు వెళ్లి అతడి కాళ్లకు దండం పెట్టాడు. ఆ తర్వాత అతడ్ని హగ్ చేసుకున్నాడు. ఇప్పుడు దీని మీదే కాంట్రవర్సీ నడుస్తోంది. పరుగులు చేయడం మీద, మ్యాచులు గెలవడంపై ధ్యాస పెట్టాలని.. ఈ ఎక్స్‌ట్రాలు అవసరమా అంటూ నెట్టింట పరాగ్‌పై క్రికెట్ లవర్స్ అక్షింతలు వేస్తున్నారు.


డెమీ గాడ్‌వా..

కోహ్లీ, రోహిత్, ధోని లాంటి వాళ్లు దిగ్గజ స్థాయిని అందుకున్నారు.. కెరీర్‌లో ఎంతో సాధించారు కాబట్టి వాళ్లను ఫ్యాన్స్ డెమీ గాడ్స్‌గా చూడటం, దండాలు పెట్టడం ఓకే గానీ.. ఐపీఎల్‌లో అంతంత మాత్రంగా ఆడే పరాగ్‌కు ఇంత ఓవరాక్షన్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. గేమ్ మీద ఫోకస్ చేయాలని.. ఇలాంటి పెయిడ్ యాక్టివిటిస్ తగ్గించుకోవాలని సెటైర్స్ వేస్తున్నారు. అయితే గ్రౌండ్‌లోకి వచ్చిన అభిమాని కావాలనే ఇలా చేశాడా.. లేదా.. అనేది తెలియదు. కానీ రాజస్థాన్ వరుస ఓటములు, పరాగ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ఈ ఘటన మాత్రం అతడిపై ట్రోలింగ్‌కు చాన్స్ ఇచ్చినట్లయింది. కాగా, పరాగ్ హోం గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగినందున లోకల్ ఫ్యాన్ అతడిపై అభిమానంతో ఇలా చేశాడని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

రోహిత్‌, కోహ్లీ ఆ గ్రేడ్‌లో ఉంటారా

అంతా పంత్‌ వల్లే..

సెపక్‌తక్రా జట్టుకు ప్రధాని అభినందన

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2025 | 10:32 AM