ఎల్‌ఆర్‌ఎస్ ఆదాయం రూ.5.72కోట్లు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:48 AM
చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 2,598 మంది ప్లాట్ల యజమానులు రూ.5.72కోట్ల ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించారు. మార్చి 31వ తేదీ సా యంత్రం 4 గంటలవరకు జరిగిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో 2,598 మంది ప్లాట్ల యజమానులు ఫీజు చెల్లించారు.

2,598 మంది ఫీజు చెల్లింపు
చౌటుప్పల్ టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 2,598 మంది ప్లాట్ల యజమానులు రూ.5.72కోట్ల ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించారు. మార్చి 31వ తేదీ సా యంత్రం 4 గంటలవరకు జరిగిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో 2,598 మంది ప్లాట్ల యజమానులు ఫీజు చెల్లించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు 2020లో 16,571 మంది రూ.1000చెల్లించి దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 13,452 మంది దరఖాస్తుదారులకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో కేవలం 2,598 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించారు. 3,119 మంది దరఖాస్తుదారులకు రకరకాల కారణాలను చూపి ఫీజు చెల్లించే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. మునిసిపల్ అధికారులు చూపించే శ్రద్ధ ఇతర శాఖల అధికారులకు లేకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులో దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించిన ప్రతీఒక్కరికి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించాలని, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించే అవకాశాన్ని ఈనెల 30వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలని మునిసిపల్ కమిషనర్ కె.నర్సింహారెడ్డి, మేనేజర్ శ్రీధర్‌రెడ్డి ప్లాట్ల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు.