Share News

Osmania University: ఓయూలో నిరసనల నిషేధంపై హైకోర్టులో పిటిషన్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:57 AM

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలను నిషేధిస్తూ రిజిస్ర్టార్‌ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Osmania University: ఓయూలో నిరసనల నిషేధంపై హైకోర్టులో పిటిషన్‌

  • రిజిస్ట్రార్‌కు న్యాయస్థానం నోటీసులు తదుపరి విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలను నిషేధిస్తూ రిజిస్ర్టార్‌ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఓయూ రిజిస్ర్టార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా వేశారు.

Updated Date - Mar 21 , 2025 | 04:57 AM