Share News

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:01 PM

Chain Smoking: ఏదైనా వ్యసనం అలవాటు అయితే వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. అది స్మోకింగ్ అయినా.. డ్రింకింగ్ అయినా.. ఇలా ఏదైనా. అయితే స్మోకింగ్ మానేసేందుకు చిట్కాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..
cigaratte

భారత్‌లో సిగరెట్ స్మోకింగ్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉంది. రోజుకు పెట్టెలకు పెట్టెలు సిగరెట్లు ఇలా ఊది పడేసే వారు దేశంలో అత్యధికంగా ఉన్నారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు సిగరెట్ల ధరలను ప్రభుత్వాలు భారీగా పెంచినా.. తాగే వారు మాత్రం ఏక్కడ తగ్గకుండా ఒక దిని తర్వాత ఒకటి అన్నట్లుగా సిగరెట్లు తాగేస్తున్నారు. సిగరెట్లు అతిగా కాల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాస కోశ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అతిగా సిగరెట్ స్మోకింగ్ చేసేవారు ఈ అలవాటును నియంత్రించడానికి కొన్ని పద్దతులు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తొలుత స్మోకింగ్ చేయడం తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. రోజుకు 20 సిగరెట్లు కాల్చేవారు.. మొదట 15కి.. ఆ తర్వాత 10కి తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ క్రమంలో నికోటిన్ డిపెండెన్సీని తగ్గించుకునేందుకు నికోటిన్ గమ్ లేదా ప్యాచ్‌లు ఉపయోగపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వాడిన వారిలో 40 శాతం మంది ధూమపానాన్ని తగ్గించగలిగారు. అయితే ఈ పద్దతిని అనుసరించి.. రోజుకు 25 నుంచి 5 సిగరెట్లకు తగ్గించిన వారు సైతం ఉన్నారని అధ్యయనాల్లో తెలింది.


అలాగే ముందుగా ఎప్పుడెప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తోందో.. ఆ ట్రిగ్గర్‌లను గుర్తించి నివారించాలి. కాఫీ తాగుతూ.. ఒత్తిడితో లేదా స్నేహితులతో కలిసి సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే.. ఆయా సందర్భాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే.. కాఫీ బదులు గ్రీన్ టీ తాగడం.. ఒత్తిడిని తగ్గించేందుకు శ్వాస వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మనస్తత్వ నిపుణులు రోజు వారీ షెడ్యుల్‌లో ధ్యానం, వాకింగ్ చేర్చమని సూచిస్తున్నారు.


ఇక వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యుని సలహాతో బుప్రోపియన్, వారెనిక్లైన్ తదితర మందులు నికోటిన్ ఆసక్తిని తగ్గిస్తాయి. సిగరెట్ స్మోకింగ్‌ నుంచి దూరంగా ప్రజలను ఉంచేందుకు దేశవ్యాప్తంగా ఉచిత కౌన్సెలింగ్ కేంద్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో కౌన్సెలర్లు వ్యక్తిగత ప్రణాళికలు రూపొందిస్తారు.


ఇక చివరిగా.. కుటుంబం, స్నేహితుల సహకారం అత్యంత కీలకం. వారి ప్రోత్సాహంతో సిగరెట్ తాగడం మానేందుకు చేసే ప్రయత్నం సులభం. ఇలా సామాజిక మద్దతు పొందిన వారిలో 60 శాతం మంది స్మోకింగ్‌ను విజయవంతంగా నియంత్రించినట్లు పలు సర్వేలలో స్పష్టమైంది. అతిగా సిగరెట్లు కాల్చేవారు ఈ పద్దతులను అనుసరిస్తే.. ఆరోగ్యం మెరుగవుతుంది. అంతే కాకుండా వారి జీవన ప్రమాణం సైతం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Health Numbers : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఆరోగ్య సంఖ్యలు ఇవే..

Prevent Pimples: ఈ తొక్క వాడితే.. ముఖంపై పింపుల్స్ రానే రావు..

Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..

Updated Date - Mar 28 , 2025 | 03:14 PM