Share News

Vijaykumar ACB Investigation: మరోసారి విజయ్‌కుమార్‌కు ఏసీబీ నోటీసులు..

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:12 PM

Vijaykumar ACB Investigation: ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 2న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

 Vijaykumar ACB Investigation: మరోసారి విజయ్‌కుమార్‌కు ఏసీబీ నోటీసులు..
Vijaykumar ACB Investigation

అమరావతి, మార్చి 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షి, బ్లూ మీడియాకు దోచిపెట్టిన కేసులో ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి (AP I&PR Commissioner Tumma Vijaykumar Reddy) ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈసారి నోటీసులో విచిత్రాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తుత దశలో మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని నోటీసులో పేర్కొంది. 2024 నవంబర్ 14న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం నమోదైన కేసులో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా అవసరమైన డాక్యుమెంట్లు అన్ని తీసుకురావాలని తెలిపింది. ఈసారి విచారణకు రాని పక్షంలో బీఎన్‌ఎస్‌ఎస్‌లో సెక్షన్ 35 (6) కింద అరెస్ట్ చేస్తామని ఏసీబీ పేర్కొంది. అయితే విజయ్‌ను అరెస్ట్ చేయబోమంటూ నోటీసులో ఏసీబీ చేర్చిన అంశంపై హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో విచారణకు హాజరుకావాలి అని ఏసీబీ నోటీసులు ఇవ్వగా.. తనకు తీరిక లేదని విజయకుమార్ రెడ్డి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.


కాగా.. జగన్‌ మీడియాతో పాటు, బ్లూ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి వందల కోట్లు ప్రకటన రూపంలో దోచిపెట్టిన విజయ్ కుమార్‌కు ఇదివరకే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో మెయిల్‌తో పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది. అయితే ఏసీబీ విచారణకు మాజీ కమిషనర్ డుమ్మా కొట్టారు. తాను బిజీగా ఉన్నానని.. వీలు చూసుకుని వస్తానంటూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా విజయ్‌కుమార్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. తొలిసారి నోటీసులకు విజయ్‌కుమార్ హాజరుకాకపోవడంతో ఏసీబీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. పైగా అరెస్ట్ చేయమంటూ కూడా నోటీసులో ఏసీబీ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య


అయితే.. గత ప్రభుత్వ హయాంలో జగన్ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియాకు కూడా ప్రభుత్వ ప్రకటనల రూపంలో వందల కోట్లు దోచిపెట్టారు విజయ్ కుమార్. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం .. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ఏసీబీకి అప్పగించింది. దీంతో ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్‌పై గుంటూరులో కేసు నమోదు చేయడమే కాకుండా విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే తొలిసారి నోటీసులకు తనకు తీరిక లేదంటూ సమాధానమిచ్చిన విజయ్‌కుమార్.. ఇప్పుడు ఇచ్చిన నోటీసులకు ఎలా స్పందిస్తారు.. విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది.


ఇవి కూడా చదవండి...

Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే

Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 03:16 PM