PM Modi: థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన ఖరారు
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:11 PM
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్డ్ ఆహ్వానం మేరకు థాయ్‌లాండ్ వెళ్తున్న మోదీ.. ఏప్రిల్ 3,4 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగే 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషిటేయటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' సదస్సులో పాల్గొంటారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) థాయ్‌లాండ్ (Thailand), శ్రీలంక (Srilanka) పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి 6 తేదీ వరకూ ఆయన పర్యటను ఉంటుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్డ్ ఆహ్వానం మేరకు థాయ్‌లాండ్ వెళ్తున్న మోదీ.. ఏప్రిల్ 3,4 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగే 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషిటేయటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' (BIMSTEC) సదస్సులో పాల్గొంటారు. కొత్తగా ప్రకటించిన "మహాసాగర్ పాలసీ'' కింద ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించాలనే భారత్ విజన్‌కు అనుగుణంగా పీఎం పర్యటన సాగనుంది.
Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం
ప్రధాన మంత్రి థాయ్‌లాండ్‌లో పర్యటించనుండటం ఇది మూడోసారని కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) తెలిపింది. థాయ్‌లాండ్, శ్రీలంకలో ప్రధాని పర్యటించనుండటం, 6వ బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొనడం ద్వారా ఫస్ట్ నైబర్‌హుడ్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్, ఇండో-పసిఫిక్ విజన్‌లపై భారత్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ను చాటుతుందని పేర్కొంది.
బిమ్‌స్టెక్ కూటమిలో ఇండియాతో పాటు శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి.2018లో ఖాట్మండులో 4వ బిమ్‌స్టెక్ సదస్సు తర్వాత బిమ్‌స్టెక్ నేతలంతా ముఖాముఖి కలుసుకోనుండటం ఇదే మొదటిసారి. 5వ బిమ్‌స్టెక్ సమావేశం కొలంబోలో మార్చి 22న వర్చువల్ తరహాలో జరిగింది. ఈసారి జరిగే సమావేశంలో ప్రాంతీయ సహకారం, భాగస్వామ్యం బలోపేతం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆహారం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దేశాధినేతలు చర్చంచన్నరు. పేటోంగ్టార్న్‌తో మోదీ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, వాణిజ్యం వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. శ్రీలంక పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు అనురకుమార దిశనాయకేను ప్రధాని మోదీ కలుస్తారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఉభయనేతలు చర్చలు జరుపుతారని, పలు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Bengaluru: మా చేతులు కట్టేశారు..
Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ
For National News And Telugu News