BJP: కేంద్ర పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం.. టార్గెట్ ఏంటంటే..
ABN , Publish Date - Mar 20 , 2025 | 07:30 PM
కరీంనగర్‌లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే వ్యూహంతో వెళ్లాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో పనిచేసేలా బీజేపీ హై కమాండ్ దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాలు అందుకున్న బీజేపీ రాష్ట్ర నేతలు (T-BJP) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలుసుకున్నారు. ముందుగా నడ్డాతో అరగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో మంచి ఫలితాలు సాధించిన నేతలను నడ్డా అభినందించారు. ఇలాగే కష్టపడితే తెలంగాణలో అధికారం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పార్ల్‌మెంట్ భవనంలో అమిత్‌షాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, నాయకులు కలిశారు (Telangana News).
ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించిన మల్క కొమురయ్య, అంజిరెడ్డిని అమిత్ షా అభినందించారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం పాటించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సర్వే గురించి కూడా అమిత్ షా మాట్లాడారు. మనం బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రం అడ్డుకోవాలని టీ-బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. కష్టపడి పని చేసి రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించాలని సూచించారు.
వరుస విజయాలు సాధిస్తుండడంతో బీజేపీ కేడర్ పూర్తి జోష్‌లో ఉంది. ఇదే స్ఫూర్తితో పని చేస్తే తెలంగాణలో అధికారం కూడా సొంతమవుతుందనే భావనతో కేడర్ ఉత్సాహంగా పని చేస్తోంది. ఈ ఉత్సాహానికి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరింత జోష్‌ను ఇచ్చాయి. కరీంనగర్‌లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే వ్యూహంతో వెళ్లాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో పనిచేసేలా బీజేపీ హై కమాండ్ దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది. ఈ మేరకు దిగువ స్థాయి నేతలతో అగ్ర నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..