Gold Roberry: అర కిలో బంగారం ఎత్తుకెళ్లిన కేటుగాడు.. మామూలు ప్లాన్ వేయలేదుగా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:15 PM
హైదరాబాద్ నార్సింగి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ఆన్ లైన్‌లో గోల్డ్ బిజినెస్ వ్యాపారం చేస్తుంటారు. నల్లగండ్లకు చెందిన రఫీ మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం చేస్తుంటారు. అయితే వారిద్దరికీ స్టీఫెన్ అనే పేరుతో ఓ వ్యక్తి శుక్రవారం ఫోన్ చేశాడు.

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ (Gachibowli Police Station) పరిధిలో ఘరానా మోసం(Gold Roberry) వెలుగు చూసింది. ఇద్దరు వ్యాపారుల దృష్టి మరల్చిన కేటుగాడు ఏకంగా అర కిలో బంగారం(500 Grams Gold), 18 వేల అమెరికన్ (యూఎస్) డాలర్లు ఎత్తుకెళ్లాడు. బాధితులిద్దరూ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా.. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నార్సింగి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ఆన్ లైన్‌లో గోల్డ్ బిజినెస్ వ్యాపారం చేస్తుంటారు. నల్లగండ్లకు చెందిన రఫీ మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం చేస్తుంటారు. అయితే వారిద్దరికీ స్టీఫెన్ అనే పేరుతో ఓ వ్యక్తి శుక్రవారం ఫోన్ చేశాడు. బంగారం, అమెరికన్ డాలర్లు కొంటానని చెప్పాడు. గచ్చిబౌలి సెంట్రో మాల్‌లో కలుద్దామని వారిని అక్కడికి రప్పించాడు. బాధితులను మాల్ లోపల ఓ రూమ్‌కి తీసుకెళ్లాడు కేటుగాడు. అనంతరం వారి నుంచి గోల్డ్ బిస్కట్లు, డాలర్లు తీసుకున్నాడు. వారిద్దరినీ అక్కడే ఉండమని, తాను వెళ్లి ఒక్క నిమిషంలో నగదు తెస్తానని చెప్పాడు.
స్టీఫెన్ మాటలు నమ్మిన బాధితులిద్దరూ అక్కడే కూర్చుండిపోయారు. ఎంతకీ రాకపోవడంతో మాల్ మెుత్తం వెతికారు. అయినా స్టీఫెన్ జాడ మాత్రం తెలియలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన చంద్రశేఖర్, రఫీ.. గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్టీఫెన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అతను ఎవరనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టీఫెన్ పాత నేరస్థుడా లేదా కొత్తగా మోసాలు మెుదలుపెట్టాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Southern States Meeting: అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్..
FIIs: యూటర్న్ తీసుకున్న ఎఫ్ఐఐలు.. భారత స్టాక్ మార్కెట్ ఇక పైపైకేనా..
Stalin JAC meeting Delimitation: డీలిమిటేషన్‌పై జేఏసీ భేటీ.. పోరాటం ఆగదని స్టాలిన్ స్పష్టీకరణ