Share News

Psycho Attack: రెచ్చిపోయిన సైకో.. కత్తితో కనిపించిన వారినల్లా..

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:50 PM

ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ పోచారం ఐటీ కారిడార్ వద్దకు ఓ సైకో చేరుకున్నాడు. కాసేపు రోడ్డుపక్కన సైలెంట్‌గా కూర్చున నిందితుడు ఒక్కసారిగా రోడ్డుపైకి దూకేశాడు.

Psycho Attack: రెచ్చిపోయిన సైకో.. కత్తితో కనిపించిన వారినల్లా..
Psycho Attack

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ (Pochampally IT Corridor) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సైకో(Psycho Attack) వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డువచ్చి వారినీ వదలకుండా వెంటపడి మరీ దాడి చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఐటీ కారిడార్ సూర్య ఆస్పత్రి వద్దకు ఓ సైకో చేరుకున్నాడు. కాసేపు రోడ్డుపక్కన సైలెంట్‌గా కూర్చున నిందితుడు ఒక్కసారిగా రోడ్డుపైకి దూకేశాడు. పార్క్ చేసి ఉంచిన కార్లను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి వారిపైనా ఏకంగా కత్తితో దాడి చేశాడు.


సైకో దాడిలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే పెద్దఎత్తున చేరుకున్న యువకులంతా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంతకీ లొంగని సైకో వారికే చుక్కలు చూపించాడు. వెంటపడి మరీ యువకులను కత్తితో రక్తమెుచ్చేలా గాయపరిచాడు. ఎట్టకేలకు పట్టుకున్న స్థానికులు సైకోను చితకబాదారు. తాళ్లతో కట్టేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో నిందితుడు స్పృహతప్పి పడిపోగా.. వెంటనే సమాచారాన్ని పోచారం సీఐ రాజు వర్మకు అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సీఐ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Southern States Meeting: అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్..

Gold Roberry: అర కిలో బంగారం ఎత్తుకెళ్లిన కేటుగాడు.. మామూలు ప్లాన్ వేయలేదుగా..

Updated Date - Mar 22 , 2025 | 01:52 PM