సన్నబియ్యం పంపిణీ ఘనత రేవంత్‌రెడ్డిదే
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:33 PM
భారత దేశంలో మొట్టమొదటి సారిగా ఉచిత సన్న బియ్యం పథకాన్ని తెలంగా ణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రా రంభించారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

- ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : భారత దేశంలో మొట్టమొదటి సారిగా ఉచిత సన్న బియ్యం పథకాన్ని తెలంగా ణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రా రంభించారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం సాయంత్రం కొల్లాపూర్ పట్టణంలోని 1, 2, 31 రేషన్ షాపుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి జూపల్లి మహిళలతో మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్ర భుత్వం అమలు చేయలేని విధంగా మన రా ష్ట్రంలో పేద కుటుంబాలకు సన్న బియ్యం అంది స్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం మేనిఫెస్టోలో లేని పథకాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని తెలిపారు. కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ అమరేందర్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాసులు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ రాజేందర్ ఆర్డీవో భన్సీ లాల్, తహసీల్దార్ విష్ణువర్ధన్ రావు, మునిసిపల్ మాజీ కౌన్సిలర్లు నరసింహారావు, బోరెల్లి కరుణ, మహేష్, ఎండీ నయుం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
పేదల సంక్షేమమే పరమా వధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కూ చకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. బుధ వారం మధ్యాహ్నం పట్టణం లోని పలు రేషన్‌దుకా ణాల్లో సన్నబియ్యం పథకాన్ని ఆయ న ప్రారంభించారు. కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ అమరేందర్ పాల్గొన్నారు.
సర్వాయి పాపన్నకు నివాళి
సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా పాత ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ఆ యన విగ్రహానికి ఎమ్మెల్సీ దా మోదర్‌రెడ్డి పూల మాల వేసి నివాళి అర్పిం చారు.