Share News

శాలిలింగోటంలో వేప చెట్టుకు కల్లు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:29 AM

: తాటి, ఈత చెట్టుకు కల్లు వస్తదని అందరికీ తెలుసు. కాని వేప చెట్టుకు కల్లు వచ్చిన అరుదైన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో జరి గింది.

శాలిలింగోటంలో వేప చెట్టుకు కల్లు
కల్లు పారుతున్న వేప చెట్టు

నల్లగొండ జిల్లాలో సంఘటన

శాలిగౌరారం మండలంలోని శాలిలింగోటం గ్రామంలో కల్లు పారే వేప చెట్టు,

శాలిగౌరారం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తాటి, ఈత చెట్టుకు కల్లు వస్తదని అందరికీ తెలుసు. కాని వేప చెట్టుకు కల్లు వచ్చిన అరుదైన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో జరి గింది. శాలిలింగోటం గ్రామానికి చెందిన గీతా కార్మి కుడు బండారు లక్ష్మయ్య వ్యవసాయ క్షేత్రంలో ఒక వేప చెట్టు ఉంది. పది రోజుల నుంచి ఈ చెట్టు కాండం నుంచి మూడు చోట్ల తెల్లగా ఊట కారడం మొదలైంది. వెంటనే ఈ విషయాన్ని కొంతమందికి చెప్పాడు. ఇది వేప కల్లు అని పలువురు చెప్పడంతో కల్లు కారే ప్రదేశం పరీక్షించాడు. కారే కల్లు అంతా కింద పోతుందని భావించి కింద ఒక లొట్టి పెట్టి చెట్టు కాండ ద్వారా కల్లు కింద పడకుండా ఒక డొప్పను తయారు చేసి లొట్టిలో కల్లు పడే విధంగా చేశాడు. రోజుకు మూడు లీటర్ల వరకు వేప కల్లు అవుతుంది. ఈ సందర్భంగా బండారు లక్ష్మయ్య ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ వేప చెట్టుకు కల్లు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇక్కడ ఈ చెట్టుకు కల్లు రావడం చూసి కొంతమంది వచ్చి కల్లు పోయాలని, అడుగుతున్నారని, రోజు ఉదయం 8గంటలకు కల్లును విడుస్తానని తెలిపారు. వేపకల్లు చేదుగా ఉందని ఆరోగ్యానికి మంచిదని రోజు కొంతమంది వేప కల్లు కావాలని తనకు ఫోన్‌ చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Mar 31 , 2025 | 12:29 AM