రెక్కల కష్టం.. మిగిలింది నష్టం
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:39 PM
పండు మిర్చి సాగుచేసిన జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి గణ నీయంగా ధర పడిపోవడంతో పాటు చీడ,పీడల కా రణంగా దిగుబడి తగ్గిపోవడంతో ఏం చేయాలో పా లుపోని పరిస్థితులు నెలకొన్నాయి.

భారీగా పడిపోయిన క్వింటాల్ ధర
ఎండు మిర్చి క్వింటాల్‌కు 12వేలు
చీడ, పీడల కారణంగా తగ్గిన దిగుబడి
జిల్లాలో యాసంగిలో 178 ఎకరాల్లో పంట సాగు
=====================
మంచిర్యాల, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పండు మిర్చి సాగుచేసిన జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి గణ నీయంగా ధర పడిపోవడంతో పాటు చీడ,పీడల కా రణంగా దిగుబడి తగ్గిపోవడంతో ఏం చేయాలో పా లుపోని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజ న్‌లో మిర్చి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు నష్టపోయే అవకాశాలు నెలకొన్నా యి. ఇదిలా ఉండగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పంట దిగుబడి తగ్గిపోవడం తో నష్టాలు వాటిల్లుతాయనే ఆందోళనలో ఉన్నారు. భూములు కౌలుకు తీసుకొని సాగుచేసి నందున య జమానికి ఒప్పందం ప్రకారం కౌలు ధరలు చెల్లించా ల్సి ఉంది. ఓవైపు దిగుబడి తగ్గిపోవడం, మరోవైపు కౌలు ధరలు చెల్లించాల్సి రావడం, పెట్టుబడులు అ ధికంగా ఉన్నందున కౌలు రైతులు మరింత ఆందో ళన కలిగిస్తోంది. మార్కెట్‌లో ధర పడిపోవడం పె ట్టుబడులు పెరగడం వల్ల పండు మిర్చి సాగు చే సిన రైతులకు రూ. 3 నుంచి 4లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.
క్వింటా ధర రూ. 12వేలు...
యాసంగి సీజన్‌కు సంబంధించి ఎండు మిర్చి ధ ర ఈ సంవత్సరం గణనీయంగా పడిపోయింది. క్విం టాలు సన్నరకం మిర్చి ధర రూ. 13వేలు, దొడ్డు ర కం రూ. 11600 ధరలు పలుకుతుండగా పెట్టుబడు లు కూడ వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. మి ర్చి సాగు కోసం ఇంటిల్లిపాది కష్టపడ్డా ఫలితం లే కుండా పోతుందనే ఆందోళనలో రైతులు ఉన్నారు. గత సంవత్సరం యాసంగిలో క్వింటాలు సన్నరకం ధర 22వేలు, దొడ్డు రకం 18వేలు పలికింది. ఈ సీ జన్‌లో క్వింటాలుపై గత సంవత్సరానికంటే రూ. 10 వేల మేర ధరలు పడిపోయాయి. దీంతో పంట సా గు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పంట చేతికి రాగా మరి కొన్ని మండలాల్లో కోత దశకు వచ్చాయి. ధర లేకపో వడంతో పంటను కొంతకాలం పాటు ఇండ్లలోనే ని ల్వచేసే ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.
గణనీయంగా తగ్గిన దిగుబడి...
యాసంగి సాగులో ఎండు మిర్చి దిగుబడి గణనీ యంగా తగ్గిపోయింది. చీడ పీడల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఊహించినదానికంటే తక్కువ దిగుబడి రావడం గమనార్హం. మరోవైపు జిల్లాలో గత సంవ త్సరంతో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరగడం కూడ ధర తగ్గడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో యాసంగి సీజన్‌లో ఎండు మిర్చి 178.26 ఎకరాల్లో సాగు చేయగా మొ త్తం 2329 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో వివిధ మండలాల్లో సాగైన పంట వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) దిగుబడి అంచనా(క్వింటాళ్లలో)
కాసిపేట 0.33 3.3
భీమిని 0.32 3.2
వేమనపల్లి 113.05 1695.75
చెన్నూర్ 4.05 40.5
జైపూర్ 20.11 201.1
కోటపల్లి 15.03 150.3
దండేపల్లి 1.10 11
హాజీపూర్ 11.32 113.2
జన్నారం 6.11 61.1
లక్షెట్టిపేట 5.04 50.4
దిగుబడి బాగా తగ్గిపోయింది....
రమేశ్‌గౌడ్, వేమనపల్లి మండలం ముల్కలపేట
గత సంవత్సరం కన్న ఈసారి మిర్చి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరానికి 20క్వింటాళ్లు దిగుబడి రావాల్సిన పంట కేవలం 6 నుంచి 7క్విం టాళ్లు మాత్రమే వచ్చింది. చీడ, పీడల ప్రభావం వ ల్ల దిగుబడి తగ్గింది. దీనికి తోడు ధర కూడ ఆశా జ నకంగా లేదు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడ లే దు. ఐదు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా రూ. 4లక్షల పై చిలుకు ఖర్చు అయింది. దిగుబడి 200 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 50 క్వింటాల్లు మాత్రమే వచ్చింది.
రూ.4లక్షల నష్టం వచ్చింది...
రాజాగౌడ్, కోటపల్లి మండలం కొల్లూరు
యాసంగిలో సాగు చేసిన మిర్చి పంట కారణం గా దాదాపు రూ. 4వేల పైచిలుకు నష్టం వాటిల్లింది. నాలుగు ఎకరాల్లో పంట సాగు చేయగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సాగు ఖర్చులు కూడ వచ్చేలా లేవు. ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమిం చి పంట సాగు చేస్తే రెక్కల కష్టమే మిగిలింది. దీ నికి తోడు ఈ సారి సన్నరకాన్ని క్వింటాల్‌కు రూ. 11,600కే విక్రయించినందున పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. మిర్చి రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలి.