MP R. Krishnaiah: సీఎం పట్టింపులకు పోవద్ద.. ఆ 400 ఎకరాలు వర్సిటీకే అప్పగించాలి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 10:35 AM
ఆ 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)కే అప్పగించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్సీయూ భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పట్టింపులకు పోవద్దన్నారు

- ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: కంచ గచ్బిబౌలి భూమిని సెంట్రల్ యూనివర్సిటీకే అప్పగించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య(MP R. Krishnaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీ భూముల్లోని చెట్లను నరికివేయడం తగదన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులపై నిర్బంధకాండ తగదని, పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పట్టింపులకు పోవద్దన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూపాయికే డ్రెస్ అంటూ పబ్లిసిటీ..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నత విద్య అందిస్తున్న ఈ వర్సిటీని మరింతగా విస్తరించాలన్నారు. సమావేశం బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేష్, అనంతయ్య, రాజేందర్; మణికంఠ, ఆశీష్ గౌడ్, లింగం, రామ్, ఉమేష్ యాదవ్, రాహుల్, బాలస్వామి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News