Share News

Gang Rape: దైవదర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:59 AM

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఓ వివాహితపై గుర్తుతెలియని ఏడుగురు సామూహిక అత్యాచారం జరిపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Gang Rape: దైవదర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలోని

ఆలయానికి అర్ధరాత్రి బంధువుతో కలిసి వచ్చిన మహిళ

ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్ను.. మిత్రులకు మెసేజ్‌

బంధువును చెట్టుకు కట్టేసి మహిళపై ఏడుగురి అత్యాచారం

అదుపులో నిందితులు.. బాధితురాలికి వైద్య పరీక్షలు

నాగర్‌కర్నూల్‌/ఊర్కొండ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తనపై గుర్తుతెలియని ఏడుగురు సామూహిక అత్యాచారం జరిపినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాఽధితురాలి ఫిర్యాదు ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు ముగ్గురు పిల్లలు. భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. శనివారం రాత్రి 11 గంటలకు తన బంధువుతో కలిసి నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ దర్శనానికి వచ్చింది. ఇద్దరూ స్వామివారిని దర్శించుకొని సమీపంలోని ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఆలయ తాత్కాలిక ఉద్యోగి వీరిని చూసి.. తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. కొద్దిసేపటికి ఓ ఆరుగురు అక్కడికొచ్చారు. ఆ ఉద్యోగి సహా ఏడుగురు మద్యం మత్తులో ఆ యువతి, ఆమెతో పాటు వచ్చిన బంధువుతో గొడవపడ్డారు. అనంత రం వివాహితతో వచ్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి.. ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ పరిశీలించారు. నిందితులను ఊర్కొండపేటకు చెందిన మహేశ్‌ గౌడ్‌, మార్పాకుల ఆంజనేయులుగౌడ్‌, మట్ట ఆంజనేయులు గౌడ్‌, సాదిక్‌ బాబా, కౌకుంట్ల హరీశ్‌గౌడ్‌, వాగుల్దాస్‌ మణికంఠ గౌడ్‌, ఎల్లికట్టకు చెందిన కార్తీక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి వారిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా వీరికి సహకరించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి ఆచూకీ కూడా తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 04:59 AM