Archbishop Udumala Bala: విశాఖ ఆర్చ్ బిషప్‌గా ఉడుమల బాల నియామకం..
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:14 PM
భారతీయ చర్చి వ్యవస్థలో గొప్ప గుర్తింపు పొందిన ఆర్చ్ బిషప్ ఉడుమల బాల పలు విభాగాల్లో పనిచేశారు. 2013లో వరంగల్ బిషప్‌గా ఆయన నియమితులయ్యారు.

విశాఖ: విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా గురువారం నాడు మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల బాధ్యతలు స్వీకరించారు. జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ గ్రౌండ్స్‌లో కార్యక్రమానికి సంబంధించిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పాపల్ రాయబారి, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి నేతృత్వం వహించి విశాఖ రోమన్ క్యాథలిక్ అగ్రపీఠానికి ఉడుముల బాలను పీఠాధిపతిగా నియమించారు. ఈ కార్యక్రమానికి వేల మంది క్రైస్తవులు హాజరై పీఠాధిపతిగా బాలను నియమించడాన్ని కన్నులపండువగా తిలకించారు.
ఈ సందర్భంగా ఉడుమల బాల మాట్లాడుతూ.. వరంగల్ నా జన్మభూమి అయితే.. విశాఖ నా పుణ్యభూమి అన్నారు. వరంగల్ నుంచి పవిత్ర భూమి వైజాగ్‌కు రావడం దేవుని కృపని నమ్ముతున్నట్లు చెప్పారు. గొప్ప మనస్సు కలిగిన ప్రజల మధ్య సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఐక్యత, శాంతి, సహకారం, అందరి మతాల మధ్య సామరస్యమే తమ లక్ష్యమని చెప్పారు. విశాఖ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా మెరుగైన విశాఖ, మెరుగైన ఆంధ్రప్రదేశ్, మెరుగైన భారత్‌ను నిర్మిద్దామని బాల పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్చ్ బిషప్‌లు, బిషప్‌లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, ప్రీస్ట్స్, మతాధికారులు హాజరయ్యారు.హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూలా, బిషప్ ఎమెరిటస్ దివ్య.. దేవుని సందేశాన్ని ప్రసంగించారు. అవుట్ గోయింగ్ అపోస్టలిక్ బిషప్ జయరావుతోపాటు, 500మందికి పైగా ప్రీస్టులు, 500మంది నన్స్, 10వేల మంది విశ్వాసులు ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. ఈ వేడుక సందర్భంగా వాల్తేరు ఆర్.ఎస్.లోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ వరకూ భారీ ఊరేగింపు నిర్వహించారు.
భారతీయ చర్చి వ్యవస్థలో గొప్ప గుర్తింపు పొందిన ఆర్చ్ బిషప్ ఉడుమల బాల పలు విభాగాల్లో పనిచేశారు. 2013లో వరంగల్ బిషప్‌గా ఆయన నియమితులయ్యారు. అనంతరం 2022 నుంచి 2024 వరకూ ఖమ్మం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 8, ఫిబ్రవరి 2025న పోప్ ఫ్రాన్సిస్ ఆయన్ను విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా నియమించారు. ఈ నియామకం ద్వారా కోస్తాంధ్ర చర్చికి కొత్త దశ మొదలైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Chandrababu Key Instructions: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. లిక్కర్ స్కామ్ కేసులో..