Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు గంటలపాటు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:54 PM
సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్‌లో ఒకటి నుంచి రెండు గంటలపాటు నాన్‌స్టాప్‌గా జల్లులు కొనసాగుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మరో రెండు గంటలపాటు భారీ వర్షాలు కువరనున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో రానున్న రెండు గంటల్లో అక్కడక్కడా తీవ్ర తుపానులు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్‌లో ఒకటి నుంచి రెండు గంటలపాటు నాన్‌స్టాప్‌గా జల్లులు కొనసాగుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, గురువారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, పిడుగుల ధాటికి ప్రజలు, పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..
Gachibowli Land Dispute: ఫేక్ వీడియోలు ప్రచారం.. ఆ పార్టీ నేతలపై కేసు నమోదు..