Share News

పాలకూర పెరుగుపచ్చడి తయారు చేయండి ఇలా..

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:42 PM

పాలకూర పెరుగుపచ్చడి తయారు చేయండి ఎలా తయారు చేస్తారో మీలో ఎంతమందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే దానిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం పదండిమరి. దానికి ఏయే పదార్ధాలు అవసరమో ఓసారి పరిశీలించినట్లయితే..

పాలకూర పెరుగుపచ్చడి తయారు చేయండి ఇలా..

కావలసిన పదార్థాలు: ఉడికించిన పాలకూర - రెండు కప్పులు, పెరుగు - కప్పు, పసుపు - అర స్పూను, పచ్చి మిర్చి - ఒకటి, పచ్చి కొబ్బరి - రెండు స్పూన్లు, జీలకర్ర - అర స్పూను, కరివేపాకు రెబ్బలు - నాలుగు, నెయ్యి - స్పూను, పోపుగింజలు - స్పూను, కొత్తిమీర - రెండు స్పూన్లు, నీళ్లు, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: పచ్చికొబ్బరి, మిర్చి, జీలకర్రతో పాటు పాలకూరను మిక్సీలో వేసి స్మూతీలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పెరుగు లేదా మజ్జిగ, ఉప్పు వేసి బాగా కలిపి పోపు పెడితే సరి. పైన కొత్తిమీర తరుగు చల్లడం మరచిపోకూడదు.

book10.2.jpg

ఈ వార్తను కూడా చదవండి: టైమ్‌ మిషన్‌లో వెనక్కి...


ఛమ్‌ ఛమ్‌

కావలసిన పదార్థాలు: చిక్కటి ఆవు పాలు - నాలుగు కప్పులు, నిమ్మరసం - రెండు స్పూన్లు, మైదా - స్పూను, చక్కెర పాకం - ఒకటిన్నర కప్పు, నీళ్లు - నాలుగు కప్పులు, యాలకుల పొడి - కొద్దిగా, నెయ్యి - స్పూను, పాలు - పావు కప్పు, పాలమీగడ - రెండు స్పూన్లు, పాలపొడి-అర కప్పు, కుంకుమపువ్వు పాలు - రెండు స్పూన్లు, ఎండు కొబ్బరి - పావు కప్పు, ట్రూటీఫ్రూటీ - మూడు స్పూన్లు.

book10.3.jpg

తయారుచేసే విధానం: ముందుగా ఆవు పాలను కాచాలి. అందులో నిమ్మరసం కలిపితే పాలు పగిలి పనీర్‌గా మారుతుంది. చల్లగయ్యాక ఓశుభ్రమైన వస్త్రంలో పనీర్‌ను మూటకట్టి 30 నిమిషాలు వేలాడదీయాలి. ఆ తరవాత ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. స్పూను మైదాను కూడా చేర్చి ఎనిమిది నిమిషాల పాటు బాగా కలపాలి. దీర్ఘచతురస్రాకార ముద్దులుగా చేసుకోవాలి. యాలకులపొడి కలిపిన చక్కెర పాకంలో పనీర్‌ ముద్దలను పావు గంటపాటు ఉడికించాలి. చల్లారాక పాలపొడిని కుంకుమ పువ్వు పాలలో కలిపి కోవాలా చేసుకోవాలి. ఒక్కో ముద్ద మధ్యలో కట్‌చేసి కోవాను పెట్టి, ఎండుకొబ్బరి. ట్యూటీఫ్రూటీలను ఉంచితే బెంగాలీ స్వీట్‌ ఛమ్‌ ఛమ్‌ తయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

మెట్రో రైల్‌పై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ఆపండి

Read Latest Telangana News and National News

Updated Date - Apr 06 , 2025 | 12:42 PM