Tomato Rasam: ఒక్క సారి పెడితే.. వారం రోజులు తాగే చారు మీకు తెలుసా..
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:56 PM
Tomato Rasam: ఈ విధంగా టమాట రసం తయారు చేసుకొంటే.. దాదాపు వారం రోజుల వరకు అవి పాడవవు. ఫ్రిజ్‌లో పెట్టకున్నా.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు వేడి చేసుకొని ఈ చారును అన్నంలో కలుపు కోవచ్చు.

చాలా మందికి చారు అన్నం అంటే అమితంగా ఇష్ట పడతారు. చారులో రకాలుంటాయి. కానీ టమాట చారు ఇలా పెట్టారంటే.. వారం రోజులు పాడవకుండా ఉంటాయి.
అది ఎలాగంటే..
ముందుగా గిన్నె తీసుకొని.. అందులో నాలుగు టమాటాలు వేయండి.
కొద్దిగా కల్లు ఉప్పు లేదా సాల్ట్ వేయండి.
అలాగే కొద్దిగా చింతపండు వేయండి ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి ఉంచి.. పప్పు గుత్తెతో బాగా మెదపాలి.
ఆ తర్వాత గిన్నెలో ఎంత కావాలో అన్ని నీళ్లు పోయాలి.
కొద్దిగా బెల్లం ముక్క లేదా స్పూన్ పంచదార వేయాలి.
అనంతరం ఈ గిన్నెను పక్కన పెట్టండి.
ముందుగా వెల్లుల్లి పాయలు గుప్పెడు తీసుకోండి.. వాటిని రోటిలో వేసి చితక్కొట్టేయండి.
కరివేపాకు నాలుగు రెమ్మలు తీసుకోండి.. దూసి పక్కన పెట్టుకొండి.
పొయ్యి మీద బాండి పెట్టి.. సన్న సెగ మీద ఉంచాలి. వేడి సెగ తగిలిన తర్వాత.. ఒక స్పూన్ నెయ్యి వేసి.. ఆ వెంటనే అందులో కొద్దిగా నూనె వేయాలి. ఇది కాగిన తర్వాత..
చితక్కొట్టి పక్కన పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవి బాగా వేగాలి.. అంటే ఎర్రగా వేగాల్సి ఉంది. ఆ తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. అవి వేగిన తర్వాత రెండు ఎండు మిరప కాయలు గిల్లి వాటిని ఆ తాళింపులో వేయాలి. అలాగే దూసి ఉంచిన కరివేపాకు రెమ్మలు సైతం ఈ తాళింపులో వేయాల్సి ఉంది.
ఈ మొత్తం మిశ్రమాన్ని గరిటతో తిప్పాలి. ఈ సందర్భంగా ఈ తాళింపు.. మంచి సువాసన వస్తుంది.
అనంతరం ఈ మొత్తాన్ని చారు కలిపిన గిన్నెలో వేసి.. పొయ్యి మీద ఉంచాలి. దాదాపు అర గంట నుంచి 40 నిమిషాల పాటు సన్న సెగ మీద ఈ చారు గిన్నెను మరగించాలి. ఆ తర్వాత ఈ చారు గిన్నెను పొయ్యి మీద నుంచి దించివేయాలి. పొయ్యి మీద నుంచి చారు గిన్నెను దించే కొద్ది నిమిషాల ముందు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేస్తే.. చారు చాలా టేస్ట్‌గా ఉండమే కాదు.. మంచి వాసనతో గుమగుమలాడతాయి.
చారులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులో ఔషధ గుణాలు పుష్కలమన్న సంగతి అందరికి తెలిసిందే. ఇవి శరీరంలోని దోషాలను తొలగిస్తాయని పెద్దలు సైతం పేర్కొంటారు.
ఈ పదార్థాలు అసలు వేయవద్దు..
పచ్చి మిర్చి, కారం వంటివి ఇందులో వేయవద్దు.