Share News

Cucumber Kanji Recipe: కీరదోసకాయ కాంజీ.. వేసవిలో చిల్లింగ్ చేసే టేస్టీ డ్రింక్

ABN , Publish Date - Apr 12 , 2025 | 07:52 PM

Summer Cucumber Drink: సమ్మర్‌లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి తరచూ కూల్ డ్రింక్స్ తాగుతారు చాలామంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కు బదులుగా రుచికరమైన కీరదోసకాయ కంజీ రెసిపీ తాగి చూడండి. నాలుకకు రుచిగా ఉంటుంది. వేసవి తాపాన్ని తరిమికొట్టి మీలో తాజా భావనను నింపుతోంది.

Cucumber Kanji Recipe: కీరదోసకాయ కాంజీ.. వేసవిలో చిల్లింగ్ చేసే టేస్టీ డ్రింక్
Summer Cucumber Kanji Recipe

Summer Cucumber Kanji Recipe: మండే ఎండలకు తట్టుకోలేక శరీరాన్ని చల్లబరిచే రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం కోసం చూస్తున్నారా..అయితే, మీకోసం ఓ అద్భుతమైన రెసిపీ ఇక్కడ ఉంది. చక్కెర అధికంగా ఉండే కూల్ డ్రింక్స్, జ్యూసులకు బదులుగా ఈ సాంప్రదాయ డ్రింక్ తాగారంటే తక్షణమే రిఫ్రెష్ అవడమే కాదు. జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. మరి, సులభమైన, అత్యంత రుచికరమైన దోసకాయ కాంజీ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోండి. వేసవిలో చల్లచల్లని అనుభూతిని సొంతం చేసుకోండి.


దోసకాయ కాంజీ అంటే ఏమిటి?

దోసకాయ కాంజీ వేసవిలో హైడ్రేషన్‌ను పెంచే ఒక భారతీయ సాంప్రదాయ పానీం.కారంగా మరియు రిఫ్రెషింగ్ పానీయం. కీరదోసకాయలు, కొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో కలిపి తయారుచేసే ఈ పానీయాన్ని కొన్నిరోజుల పాటు ఎండలో పులియబెడతారు. రుచిలో పుల్లగా, కారంగా ఉండే ఈ ఆరోగ్యకరమైన పానీయంలో వేసవి తాపాన్ని పోగొట్టగలిగే పోషకాలతో పాటుగా విటమిన్ కె, సి, ప్రోబయోటిక్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే పేగు ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.


దోసకాయ కాంజీ తయారీకి కావాలసిన పదార్థాలు:

  • 2 మీడియం సైజు దోసకాయలు ( తొక్క తీసి తురిమినవి లేదా ముక్కలుగా కట్ చేసినవి)

  • 4 కప్పుల నీరు (మరిగించి చల్లార్చినవి)

  • 2 టేబుల్ స్పూన్లు పసుపు

  • 1 టీ స్పూన్ ఆవపొడి

  • 1 టీస్పూన్ ఎర్ర కారం పొడి (ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు)

  • 1/2 టీస్పూన్ నల్ల ఉప్పు

  • 1/4 టీస్పూన్ ఇంగువ (ఆప్షనల్)

  • తగినంత ఉప్పు


తయారీ విధానం

  • ఒక పెద్ద గిన్నెలో తురిమిన కీర దోసకాయముక్కలను, ఆవపొడి, పసుపు, ఎర్ర కారం, నల్ల ఉప్పు, ఇంగువ, ఉప్పు కలపండి

  • ఈ మిశ్రమంలో మరగబెట్టి చల్లార్చిన నీటిని వేసి బాగా కలపండి. తర్వాత ఓ గాజు సీసా లేదా జాడీలోకి ఈ మిశ్రమాన్ని పోయండి.

  • జాడీని తేలికపాటి కాటన్ గుడ్డతో లేదా వదులుగా ఉండే మూతతో కప్పండి. పులియబెట్టే ప్రక్రియ వాయువులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దానిని గట్టిగా మూసివేయవద్దు.

  • ఉష్ణోగ్రతను బట్టి జాడీని 2-4 రోజులు ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి. వాతావరణం వెచ్చగా ఉంటే పులియబెట్టే ప్రక్రియ జరుగుతుంది.

  • అయితే, ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కలుపుతూ ఉండాలి.

  • కాంజీ పుల్లని వాసన రావడం ప్రారంభించినా.. దోసకాయలు కొంచెం మెత్తబడినా అది తాగేందుకు సిద్ధంగా ఉందని అర్థం.

  • మీకు నచ్చిన విధంగా పులియబెట్టిన తర్వాత కాంజీని చల్లబరచండి.

  • తాగేటప్పుడు కొన్ని తాజా కొత్తిమీర ఆకులను కలుపుకోవచ్చు.


Read Also: Tomato Rasam: ఒక్క సారి పెడితే.. వారం రోజులు తాగే చారు మీకు తెలుసా..

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

పాలకూర పెరుగుపచ్చడి తయారు చేయండి ఇలా..

Updated Date - Apr 12 , 2025 | 07:54 PM