Earthquakes: భూకంపాలకు హైదరాబాద్ సేఫేనా..
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:20 PM
వరుసగా ఏర్పడుతున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సురక్షితమనేది తొలస్తున్న ప్రశ్న. భూకంపాలకు దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్. భూకంప తీవ్రత రెండు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

వరుసగా ఏర్పడుతున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సురక్షితమనేది ఇప్పుడు తొలస్తున్న ప్రశ్న. భూకంపాలకు దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్. భూకంపాలకు తెలుగు రాష్ట్రాలు సురక్షితమేనా. హైదరాబాద్ పరిస్థితి ఏంటి. హైదరాబాద్‌కు తలమాణికంగా ఉండే చార్మినార్ పరిస్థితి ఏంటి. భూకంప తీవ్రతకు చార్మినార్ పడిపోతుందా. శాస్త్రవేత్తల అంచనాలు ఎలా ఉన్నాయో. ఈ కథనంలో తెలుసుకుందాం.
మయన్నార్ కంటే భారీ భూకంపం వస్తుందా. అది అతి పెద్ద భూకంపమా అంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాల్సి ఉంటుంది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత పది పాయింట్లు దాటే అవకాశాలు కూడా ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఇంతవరకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. సునామీ వచ్చినప్పుడు కూడా 9.3 తీవ్రతే నమోదైంది. అప్పుడు భూకంపం కంటే సునామీతోనే ఎక్కువమంది ప్రజలు చనిపోయారు. భూకంపాల ప్రభావం భారత్ మీద ఉంటుందా అంటే కొన్ని ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భూకంపాల తీవ్రత ఉత్తరాదికి, దక్షిణాదికి షిఫ్ట్ అవుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఉత్తరాదిలో భూ పలకలు ఢీకొన్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత దక్షిణాదికి భూకంపాలు వస్తున్నాయి.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..
భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాలు..