ఈ సమయంలో వైసీపీ గురించి అవసరమా..: పురందేశ్వరి
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:10 PM
ఉత్తరాదిలో పండుగగా హోలీని జరుపుకుంటారని, మనం హోలీని వసంతోత్సవంగానూ ఘనంగా నిర్వహించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రాంతాలకు అతీతంగా పండుగ జరుపుకునే పండుగ హోలీ అని వ్యాఖ్యానించారు.
విజయవాడ: కూటమి ప్రభుత్వం (Kutami Govt) అధికారంలోకి వచ్చాక బీజేపీ శ్రేణులు (BJP Leaders) సంతోషంగా హోలీ సంబరాలు (Holi Celebrations) అంబరాన్ని అంటే విధంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలొ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. హోలీ అంటే ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా జరుపుకునే పండగని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పురందేశ్వరి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా చక్కటి వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నామన్నారు. ఈ సమయంలో వైసీపీ గురించి మాట్లాడడం మనకు అంత అవసరమా అని మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Also Read..:
ఆ షాపులన్నీ అక్రమమైనవని తెలిసినా..
ఉత్తరాదిలో పండుగగా హోలీని జరుపుకుంటారని, మనం హోలీని వసంతోత్సవంగానూ ఘనంగా నిర్వహించుకుంటామని పురందేశ్వరి అన్నారు. ప్రాంతాలకు అతీతంగా పండుగ జరుపుకునే పండుగ హోలీ అని, సహ బాతృత్వం సందేశంతో ముందుకు వెళ్లాలని అప్పుడే శ్రేష్టమైన భారత్ సాకారమవుతుందన్నారు. ‘సబ్ కా సాత్ ...సబ్ కా వికాస్’ అంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలనేది ప్రధాని మోదీ సందేశమన్నారు. బీజేపీ భావన కూడా ఇదే అని అన్నారు. బీజేపీ నేతలంతా ఈ మార్గంలో వెళ్లాలని.. అంతా కలసి ఉండాలనే సందేశంతో ప్రజలంతా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని పురందేశ్వరి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శంషాబాద్‌కా.. వామ్మో అంటున్న క్యాబ్ డ్రైవర్లు..
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..
హోలీ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..
For More AP News and Telugu News
Updated at - Mar 14 , 2025 | 01:10 PM