క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు.. అసలు కారణమిదే..
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:58 PM
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా పెద్ద తప్పు చేశానని సుప్రీత అన్నారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా పెద్ద తప్పు చేశానని సుప్రీత అన్నారు. ఇక మీదట బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని తెలిపారు. ఎవరూ కూడా వీటిని ప్రమోట్ చేయొద్దని కోరారు. మీ ఫోన్‌లో ఉండే బెట్టింగ్ యాప్స్‌ను డిలీట్ చేయాలని సూచించారు. ఈ యాప్‌లను ఫాలో కావద్దని సురేఖవాణి కూతురు సుప్రీత పేర్కొన్నారు.
అనంతరం బెట్టింగ్ యాప్స్ గురించి టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి మాట్లాడారు. ఎవరూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయొద్దని తెలిపారు. డౌన్‌లోడ్ చేసుకుంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని కోరారు. ముందుగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రలోభాలకు గురిచేస్తారని అన్నారు. కష్టపడకుండా డబ్బు ఇస్తామని నమ్మిస్తారని చెప్పారు. ఆ తర్వాత మీ అకౌంట్‌లో ఉండే డబ్బులను స్వాహా చేస్తారని అన్నారు. ఈ యాప్‌లను నమ్ముకుని చాలామంది జీవితాలు కోల్పోతున్నారని చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయకుండా ఉండాలని సురేఖావాణి తెలిపారు.
మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - Mar 15 , 2025 | 01:09 PM