కాకినాడలో దారుణం..చదువులో వెనకబడ్డారని పిల్లలని చంపిన తండ్రి
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:54 PM
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలను ముంచి ఊపిరి తీసేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలను ముంచి ఊపిరి తీసేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని దాంతో వారిని చంపేసినట్లు తండ్రి సూసైడ్ నోటులో రాశాడు. కాకినాడలోని సుబ్బారావు నగర్‌లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషదం నింపింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వానపల్లి చంద్ర కిషోర్ కాకినాడ జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెట్‌గా పని చేస్తున్నాడు.
అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే జోషల్, యూకేజీ చదివే నిఖిల్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు సరిగా చదవడం లేదని ఇటీవల పాఠశాల మార్పించాడు. హోలీ సందర్భంగా చంద్ర కిషోర్ భార్య, పిల్లలను తీసుకుని తాను పని చేసే కార్యాలయంలో వేడుకలకు వెళ్లాడు. పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడం తనూజ ఇంటికి వెళ్లి చూసేసరికి కిటికీలో నుంచి చూడగా భర్త చంద్ర కిషోర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పిల్లలు ఇద్దరూ నిండా నీళ్లు ఉన్న బకెట్లలో మునిగి పోయి ఉన్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోయాడు.
మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu Naidu: నిబద్ధతతో కూడిన రాజకీయాలకు ప్రతీక జనసేన
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Read Latest AP News And Telugu News
Updated at - Mar 15 , 2025 | 01:15 PM