ABN Live..: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ABN, Publish Date - Mar 24 , 2025 | 11:25 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభాపతి ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతోంది. అనంతరం శాసనసభలో రెండు చట్ట సవరణ బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది. అలాగే నాలుగు పద్ధులపై చర్చ జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly, Budget session) 8వ రోజు (8th Day) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభాపతి ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతోంది. అనంతరం శాసనసభలో రెండు చట్ట సవరణ బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది. అలాగే నాలుగు పద్ధులపై చర్చ జరగనుంది. 1. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ , మైనారిటీ వెల్ఫేర్ శాఖల పద్దులపై చర్చ జరుగుతుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు. 2. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల పద్దుపై చర్చ జరగనుంది. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇస్తారు. 3. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ చైల్డ్ అండ్ డిజేబుల్ వెల్ఫేర్ శాఖల పద్దులపై చర్చ... సమాధానం ఇవ్వనున్న మంత్రి సీతక్క. 4. బీసీ వెల్ఫేర్ శాఖ పద్దుపై చర్చ జరుగుతుంది. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇస్తారు.
బిల్లులు
తెలంగాణ మున్సిపాలిటీస్ అమెండ్‌మెంట్ బిల్ 2025పై సభలో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదానికి పెట్టనున్నారు. అలాగే తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్‌మెంట్ బిల్లు 2025ను చర్చించి మంత్రి సీతక్క ఆమోదానికి పెట్టనున్నారు.
Updated at - Mar 24 , 2025 | 11:25 AM