Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆందోళన
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:26 AM
ప్రముఖ క్రైస్తవ సువార్తీకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాల నాయకులు, అనుచరులు పెద్ద సంఖ్యలో చేరి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం కాదు.. హత్యేనంటూ నిరసనలు
దర్యాప్తు వేగవంతం: ఎస్పీ నరసింహ కిశోర్
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్రైస్తవ సువార్తీకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకు లు, ప్రవీణ్ అనుచరులతోపాటు తెలంగాణలోని ప లు ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు ఆసుప త్రి వద్దకు చేరుకున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదవశాత్తు చనిపోలేదని.. ఆయన హత్యకు గురయ్యార ని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతదేహానికి అధికారులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం పూర్తిచేశారు. అనంతరం.. బందోబస్తు మధ్య మృత దేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలావుంటే.. క్రైస్తవ విశ్వాసులు పెద్దసంఖ్యలో మోకాళ్లపై నిలబ డి ప్రవీణ్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ గది లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నా రు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు.
ఆఖరి క్షణాలు.. ఇలా!
వీడియో కెమెరాల్లో నమోదైన సీసీ ఫుటేజ్ ప్రకారం.. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై వస్తున్న పాస్టర్ ప్రవీణ్ సోమవారం రాత్రి 11 గంటల 31 నిమిషాలకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేటు దాటారు. తర్వాత 11 గంటల 42 నిమిషాలకు (11 నిమిషాలు) బుల్లెట్ నయారా పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంది(ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 10-11 కిలో మీటర్లు) సరిగ్గా బంకుకు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్‌తో సహా పడిపోయారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News