Gold and Silver Prices: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. గోల్డ్ షాపుల వైపు చూడాలంటే భయపడాల్సిందే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 06:41 AM
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. రెండ్రోజులుగా ధర వరసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్ ధరలో మార్పులు వస్తుంటాయి.

బిజినెస్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర వరసగా రెండో రోజూ పెరిగింది. సాధారణంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పసిడి రేట్లలో మార్పులు వస్తుంటాయి. అయితే ఇటీవల తగ్గినట్లే తగ్గిన గోల్డ్ రేటు మళ్లీ పుంజుకుంది. https://bullions.co.in/ ప్రకారం.. నిన్న (బుధవారం) ఉదయం 06:30 గంటల సమయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.80,392 ఉండగా.. నేడు(27-03-2025) రూ.80,474కు చేరింది. 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.87,700 కాగా.. ఇవాళ రూ.87,790కి పెరిగింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.80,529 కాగా.. ఈరోజు రూ.80,612కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.87,850 ఉండగా.. నేడు రూ.87,940 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారం రూ.80,658 ఉండగా.. రూ.80,740కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు బుధవారం రూ.87,990 కాగా.. నేడు రూ.88,080కి పెరిగింది.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు- రూ.80,676, రూ.88,010
పుణె- రూ.80,612, రూ.87,940
అహ్మదాబాద్- రూ.80,722, రూ.88,060
భువనేశ్వర్- రూ.80,639, రూ.87,970
భోపాల్- రూ.80,703, రూ.88,040
కోల్‌కతా- రూ.80,511, రూ.87,830
చెన్నై- రూ.80,850, రూ.88,200
కోయంబత్తూర్- రూ.80,850, రూ.88,200
పట్నా- రూ.80,575, రూ.87,900
సూరత్- రూ.80,722, రూ.88,060
వెండి ధర పరిస్థితి ఇదీ..
దేశవ్యాప్తంగా వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర బుధవారం ఉదయం రూ.99,120 ఉండగా.. గురువారం ఉదయానికి రూ.99,370కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న రూ.99,290 ఉన్న కేజీ వెండి రేటు ఇవాళ రూ.99,540కు చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కిలో వెండి ధర బుధవారం రూ.99,440 కాగా.. నేడు రూ.99,700కి పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
నిస్సాన్ నుంచి 2 కొత్త కార్లు