Home » Akhilesh Yadav
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్పూర్లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.
'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్‌లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కనౌజ్ లోక్‌సభ అభ్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ స్థానిక సిద్దపీట్ బాబా గౌరీ శంకర్ మహదేవ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు.