Home » Amaravati
అమరావతి: ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపుతున్నారు. ఆయా కేంద్రాలవద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..
వల్లభేనేని వంశీకి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై మరో రెండు కేసులు నమోదు చేశారు. వంశీపై నమోదైన కేసులన్ని సీట్‌కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిన్న పోలీసుల విచారణలో వంశీనే నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో ‘తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అని సమాధానాలు చెబుతాడు. ఈ డైలాగులనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. వంశీ జవాబులు ఇచ్చినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
CM Chandrababu: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. అందుకోసం తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిాపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి’ అని మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఏపీలో మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) తక్షణమే అమలు చేయడానికి అంగీకరించింది.
అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికార పక్షం రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.