Share News

CID: వల్లభనేని వంశీపై సీఐడి పిటి వారెంట్ జారీ

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:54 AM

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్‌సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

CID: వల్లభనేని వంశీపై సీఐడి పిటి వారెంట్ జారీ
CID Issued PTI Warrant

విజయవాడ: గన్నవరం తెలుగుదేశం పార్టీ (TDP) కార్యాలయంపై దాడి కేసులో (Assault Case) సిఐడి (CID) దూకుడు పెంచింది. వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)పై అధికారులు పిటి వారెంట్ (PT warrant) జారీ చేశారు. ఈనెల 25వ తేదీన (మంగళవారం) కోర్టు (Court)లో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు (Satyavardhan kidnapping case)లో వంశీ జిల్లా జైలులో ఉన్నాడు. ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో‌ వంశీని‌ విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే గన్నవరం టిడిపి కార్యాలయం దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ కీలక ఆదేశాలు..


కాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి (Former MLA Vallabhaneni Vamshi) ఏపీ హైకోర్టు (AP High Court) షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించేందుకు తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


కాగా వైఎస్సార్‌సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఈ నెల 13న హైదరాబాద్‌లో అరెస్టు చేసి అక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీని జిల్లా కోర్టుకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 24 , 2025 | 11:54 AM