Home » Amaravati
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి సిట్ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.
వైసీపీ హయాంలో ఎమ్మెల్యే విడదల రజని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ కలిసి క్వారీ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు
ఉపాధి హామీ పథకంలోని అంబుడ్స్మెన్ వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యమైన దశలో ఉంది. 8 జిల్లాల్లో పదవీకాలం ముగిసినప్పటికీ అధికారులు రీన్యువల్ చేయకపోవడంతో సందిగ్ధత నెలకొంది
Chandrababu: రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ముహూర్తం ఖారారు అయింది. బుధవారం ఉదయం వెలగపూడిలోని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
Mega Health Hub: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. 19,264 కోట్లు వైద్యారోగ్యశాఖలో ఖర్చు చేస్తున్నామని.. ఆశించిన ఫలితాలు మాత్రం రావడంలేదన్నారు. ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని.. అందుకే ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు.
అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు.'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమంలో భాగంగా మూడో రోజు సోమవారం ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు.