Home » AP Govt
జగన్ ప్రభుత్వంలో ఎర్ర మట్టి దిబ్బలు ఎలా ధ్వంసం చేశారనే విషయాన్ని చాలా సార్లు చెప్పామని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఎర్రమట్టి దిబ్బల బౌండరీలపై తేడాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. జియాలాజిస్ట్‌లు దీనిపై రిపోర్ట్స్ ఇచ్చారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డి.రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ఐ.ఏఫ్.యస్ అధికారులు ఎందరో వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యమని అన్నారు. అటవీ సంరక్షణ కోసం నేటి తరం, భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.
2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల నుంచి వినిపించిన మాటలు ఇవే.. అధికారం ఉందనే అహంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులు హద్దులు దాటుతుంటే హెచ్చరించాల్సిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గా ఉండటమే కాకుండా..
Andhrapradesh: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల సెకెండ్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఉండవల్లి శ్రీదేవి, గండి బాబ్జి, గొట్టిముక్కల రఘురామరాజు, ఆనం వెంకటరమణారెడ్డి, కొమ్మారెడ్డి...
రెవెన్యూ శాఖలో వసూళ్ల పర్వానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కింది నుంచి పైదాకా చేతులు చాపే వ్యవహారం నడుస్తోంది. ఏ చిన్నపనికైనా బేరసారాలు మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మహిళ అఘోరి సంచరిస్తున్నారు. అఘోరి రావడంతో ఆలయాల వద్దకు భారీగా జనం వస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గో వధ, చిన్నారులపై లైంగికదాడులు అరికట్టాలని కోరారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను రూ.15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.