Home » AP Police
ఏపీ పోలీసులపై కేంద్ర ఎన్నిల సంఘం వేటు వేసింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి సహకరించారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తీసుకురావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ రామాంజనేయులపై బదిలీ వేటు వేసింది.
టీడీపీ నేతలకు ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి నానా హంగామా చేస్తున్నారు. తొలుత అనుమతి ఇచ్చి.. తర్వాత వైసీపీ నేతల మాటలకు తలొగ్గి తమను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి..
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉంది. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్స్ చేస్తున్నారు. మద్యం తరలింపులపై పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు...
Andhrapradesh: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని
మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని.. ‘‘జగన్నాటకం’’.. ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాను ఇరింకేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. అయితే కావాలని టీడీపీ నేతలను ఇరికించేందకు యత్నిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడితున్నాయి. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి బొండో ఉమా స్పష్టతనిచ్చారు. సీఎంపై రాయి దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మందికిపై పోలీస్ సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్‌తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు.
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్‌తో జగన్‌పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.