Home » Arvind Kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపకుండా చూస్తామని దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా భరోసా ఇచ్చారు. బుధవారంనాడిక్కడ జరిగిన ఒక సమ్మిట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తాజా సమాధానమిచ్చారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తరచూ మీడియా ముందుకు రావడం, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఢిల్లీలో రిపీట్ కావొచ్చని.. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు.
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.
దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్(Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది.