Home » Arvind Kejriwal
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీలో.. కేజ్రీవాల్ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకుంటారని అంతా అంచనావేశారు. కానీ చివరికి బీజేపీ అధికారానికి అవసవరమైన మెజార్టీ సాధించింది. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏమిటి.. ఆ ఒక్కపని చేసుకుంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా.. కేజ్రీవాల్ చేసిన తప్పేంటి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను ఏమీ చేయనీయడం లేదం టూ సుదీర్ఘకాలం పాటు ఆప్ అధినేత, అప్పటి సీఎం కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసులు తనకు సహకరించడం లేదన్నారు. రహదారులను బాగుచేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఢిల్లీ కార్పొరేషన్లో తనకు బలం లేనందున సాగడం లేదన్నారు. దీంతో 2022లో ప్రజలు కార్పొరేషన్ పగ్గాలను కూడా ఆప్కే అప్పగించారు.
ఆప్ ప్రభుత్వ అవినీతిపై సిట్ ఏర్పాటు చేయడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని బీజేపీ ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత కూడా ప్రకటించడంతో ఆప్‌కు మునుముందు చిక్కులు తప్పేలా లేవు.
అందరూ ఊహించినట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘెర ఓటమిని మూటగట్టుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఆప్‌తో ఉన్న పేద, మధ్య తరగతి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ వేసిన మంత్రం ఏమిటి..
Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే జరిగింది. ఫలితాల్లో బీజేపీ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ఢిల్లీలో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించింది. వరుసగా మూడో సారి విజయకేతనం ఎగురవేసి ఢిల్లీ గద్దె ఎక్కాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రచారంలో దూసుకుపోయి ఢిల్లీ వాసుల మనసులు గెలిచిన బీజేపీ అధికారం అందుకుంటోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే కమలం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంతో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల సరళి చూస్తే బీజేపీ మెజార్టీ మార్క్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విజయం సాధించనప్పటికీ.. ఒక విషయంలో మాత్రం ఆ పార్టీ విజయం సాధించింది.