Delhi Assembly Election Result Live: కేజ్రీవాల్‌కు ఓటమి రుచి చూపించిన.. పర్వేష్ వర్మ ఎవరు.. ?
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:35 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే కమలం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంతో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గానూ 45 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ గెలుపు ఖాయం చేసుకుంది కమలం పార్టీ. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దె ఎక్కే అవకాశం రావడంతో బీజేపీ పార్టీ నేతలు సంబరాలు షురూ చేశారు. 25 స్థానాలు కూడా గెలవలేక ఘోర ఓటమి ఖాయం చేసుకుని ఆప్ పార్టీ నిరాశలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే న్యూఢిల్లీలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‍ను ఓడించి సీఎం అభ్యర్థి రేసులో పర్వేష్ వర్మ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేజ్రీవాల్‌కే చుక్కలు చూపించిన ఇతడెవరా అంతా ఆరా తీస్తున్నారు.
కేజ్రీవాల్‌ను ఓడించిన మాజీ సీఎం కుమారుడు..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాబిబ్ సింగ్ వర్మ. జాట్ కుటుంబానికి చెందిన ఇతడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తర్వాతి ఏడాదే పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 లక్షల 68 వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఓటమనేదే ఎరుగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు.
ఓటమి ఎరుగని నేత పర్వేష్.. రికార్డు రిపీట్..!
ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కే చెమటలు పట్టించిన పర్వేశ్ వర్మ తన రాజీకయ జీవితంలో ఎప్పుడూ ఓటమనేదే ఎరుగరు. తాజాగా న్యూ ఢిల్లీలోనూ అదే రికార్డు రిపీట్ చేశారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ న్యూ ఢిల్లీలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించి పీడ కలను మిగిల్చారు. ఇప్పటికే జంగ్‌పురాలో ఆప్ అగ్రనేత మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. కల్కాజీలో సీఎం ఆతిషీ గెలుపు ఒక్కటే ఆప్ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపించలేకపోయింది. వరసగా మూడోసారి ఘెర ఓటమిపాలై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక కేజ్రీవాల్‌పై గెల్చిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..