Arvind Kejriwal: ఢిల్లీలో మమ్మల్ని ఓడించాలంటే బీజేపీ మరో జన్మ ఎత్తాలి: కేజ్రివాల్ పాత వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:23 PM
ఢిల్లీలో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించింది. వరుసగా మూడో సారి విజయకేతనం ఎగురవేసి ఢిల్లీ గద్దె ఎక్కాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రచారంలో దూసుకుపోయి ఢిల్లీ వాసుల మనసులు గెలిచిన బీజేపీ అధికారం అందుకుంటోంది.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi Elections) పీఠం ఎవరిదో తెలిపోయింది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరబోతోంది. స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ (BJP).. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని మట్టికరిపించింది. వరుసగా మూడో సారి విజయకేతనం ఎగురవేసి ఢిల్లీ గద్దె ఎక్కాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆశలు గల్లంతయ్యాయి. ప్రచారంలో దూసుకుపోయి ఢిల్లీ వాసుల మనసులు గెలిచిన బీజేపీ అధికారం అందుకుంటోంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2023లో ఢిల్లీలో కార్యకర్తల సమావేశానికి హాజరైన కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ``ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారు. ఢిల్లీలో గెలవాలని నరేంద్ర మోదీ కలలు కంటున్నారు. ఎన్నికల ద్వారా మాపై విజయం సాధించలేమని వాళ్లకు తెలుసు. మోదీజీ.. మీరు మమ్మల్ని ఈ జీవితంలో ఓడించలేరు. ఢిల్లీలో మమ్మల్ని గెలవాలంటే మరో జన్మ ఎత్తాలి`` అంటూ ఆ సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాదాపు 26 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. 70 సీట్ల అసెంబ్లీ సీట్లలో 47 స్థానాలను కైవసం చేసుకునే దిశగా బీజేపీ కదులుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఓటమి పాలవడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..