Home » Asaduddin Owaisi
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరోసారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్‌కు 6,61,981 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు
హైదరాబాద్ లోక్‌సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.
ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ లోక్‌సభ స్థానం కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత(Madhavilatha) సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు.
హైదరాబాద్ మినహా మిగతా లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్ కౌర్‌కు గంట సమయం ఇవ్వండి.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెచ్చగొట్టే సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్‌కౌర్ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్‌తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకుని, సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ‘ఓటు వేయాలంటూ’ ప్రజలకు పిలుపునిస్తుంటారు.