Home » Budget 2024
2024-25 వార్షిక బడ్జెట్‌పై శాసనసభ, మండలిలలో శనివారం సాధారణ చర్చ జరగనుంది.
కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో 'వివక్ష' చూపారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు ఈసారి 'నీతి ఆయోగ్' లో ఆ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ''నీతి ఆయోగ్'' సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న రాజకీయ వివక్షపై నిరసన తెలపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అతి క్లిష్టమైన రుణ మాఫీ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ(Telangana)కు తీవ్ర అన్యాయం జరిగిందని వక్తలు ఆరోపించారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధులు కేటాయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్టీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధుల కింద రూ.50,180 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీల ప్రత్యేక నిధికి రూ.33,124 కోట్లు, ఎస్టీకి రూ.17,056 కోట్లు ఇచ్చింది.
రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను వివిధ విభాగాలకు కేటాయించింది. అయితే బడ్జెట్‌లో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించలేదని విపక్షాలు ఆరోపిస్తుండగా జనరంజకంగా ఉందని అధికార పక్షం వాదిస్తోంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఈసారి బడ్జెట్‌లో గణనీయంగా నిధులు కేటాయించారు. గత సర్కారుకు భిన్నంగా రేవంత్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల భారీ మొత్తంతో మహానగర అభివృద్ధికి తెర తీసింది.
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
రాష్ట్ర మొత్తం అప్పు మరింతగా పెరగబోతోంది. దీని వల్ల ప్రజలపై తలసరి అప్పు భారం కూడా పెరగనుంది.