Home » Business news
ఏప్రిల్‌లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.31,575 కోట్లు భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఏడాది మొత్తం చూస్తే ఇప్పటి వరకూ ఎఫ్‌పీఐల నికర నిధుల వాపసం రూ.1.48 లక్షల కోట్లకు చేరింది
ఆర్బీఐ ఫారెక్స్ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది
నిఫ్టీ 23,000 పాయింట్ల వద్ద నిరోధానికి గురవుతుండగా, మార్కెట్ స్వల్పకాలిక కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించే అవకాశముంది. బుల్లిష్ ట్రెండ్ కొనసాగాలంటే 23,000 పై స్థాయిలో బలమైన క్లోజ్ అవసరం
అరబిందో ఫార్మా అభివృద్ధి చేసిన ‘రివారోక్సాబాన్’ టాబ్లెట్లకు అమెరికా FDA అనుమతి ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఈ ఔషధాన్ని జూన్‌లోగా అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు
అమెరికా చైనా సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ ఐఫోన్ తయారీ కోసం భారత్‌పై దృష్టి పెట్టింది. మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించే వ్యూహంలో భాగంగా భారత్‌లో కార్యకలాపాలను పెంచుతోంది.
మీకు వచ్చే వారం బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం ఉందా? అయితే ఈ వార్త మీకు ఎంతో అవసరం. ఎందుకంటే వచ్చే వారం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు వరుసగా రావడం వల్ల, చాలా సేవలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టెక్ ప్రపంచానికి ఊరట కలిగించే పెద్ద గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొంతకాలంగా చైనా నుంచి దిగుమతులు చేయబడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమలులో ఉన్న 145% సుంకాలు ఇప్పుడు తొలగించబడతాయి. ట్రంప్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్న వేళ, ఈరోజు కాస్త ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో ఈ రేట్లు ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళలకు ప్రత్యేకంగా రూపొందిన సూపర్‌ఉమన్ టర్మ్ (SWT) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థల (MSME) ఆర్థిక రంగాన్ని పరివర్తన చేయడంలో ఈ యోజన కీలకమైన ఊతమిచ్చింది.