Home » Chandrababu
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.
ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మంచి ఆరోగ్యంతో పాటు దేశ సేవలో దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ యాగీ చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయడు నేడు (మంగళవారం) బిజీబిజీగా గడపనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై ఆయన రివ్యూ చేయనున్నారు. అనంతరం బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై కూడా సమీక్షలు నిర్వహించనున్నారు.
ముంబై నటి కాదంబరీ జెత్వానికి వైసీపీ వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీపై సస్పెన్షన్ వేటు వేసింది.
నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం..
గుర్తుందా ? గతేడాది సరిగ్గా ఇదే రోజు.. అవును. సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023, సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (ఆదివారం) విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బుడమేరులో కబ్జాలతో లక్షల మందికి ఇబ్బందులు ఎదురయ్యాయని, ఎనిమిదో రోజు కూడా బాధితులు వరదలోనే ఉన్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృష్ణానదిలో వరదలు వచ్చాయని పేర్కొన్నారు.