Home » Chittoor
Andhrapradesh: రుయా ఆస్పత్రిలో ఉద్యోగులు తాగుబోతుల అవతారం ఎత్తారు. రుయా ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీఐటీయూ ఆఫీస్‌లో మద్యం సేవిస్తూ ఉద్యోగులు పట్టుబడ్డారు. రోగుల వార్డులలో నీరు రావడం లేదని ఏఆర్ఏంఓ హరికృష్ణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాటర్ మ్యాన్ సుబ్రహ్మణ్యం అందుబాటులో లేకపోవడంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
చిత్తూరు జిల్లా: వాలంటీర్ల తొలగింపు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. చిత్తూరు జిల్లాలో తాజాగా మరో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది వాలంటీర్ల తొలగించారు.
Andhrapradesh: ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై వీకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఎమ్మెల్యే ఫోటోలు ఉన్న ప్యాడ్లను విద్యార్థులకు అందించి వాటితో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఇదే అంశాన్ని సోమవారం పలమనేర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గమనించిన పరీక్షల పర్యవేక్షకులు పలమనేరు ఆర్డీవోకు నివేదిక అందించారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. కుప్పం మండల టెక్నీకల్ అసిస్టెంట్ మురుగేష్, చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరుపున కండువా కప్పుకొని ప్రచారం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, అధికారుల సమావేశనికి వైసీపీ తరుపున హాజరైన మురుగేష్‌పై ఈసీ చర్యలు తీసుకుంది.
Andhrapradesh: తిరుపతిలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి టీడీపీ ఇంచార్జి సుగుణమ్మ కీలక తీర్మానం చేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరని శ్రీనివాసులును జనసేన - టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని అన్నారు. కూటమిలో ఏ పార్టీ అయినా, అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని.. గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
Andhrapradesh: చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చెయ్యలేదని.. పొత్తులతోనే పోటీ చేశారని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు బలం చాలకే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నారన్నారు. అందరూ ఏకమైన.. రానున్న ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో 33 మంది వలంటీర్లను అధికారులు తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురిని అధికారులు తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వలంటీర్లను తొలగించినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు గన్‌మెన్ తొలగింపుపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సీకే బాబుకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అంటూ భార్య సీకే లావణ్య హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజల మధ్య ఉన్న నాయకుడు సీకే బాబు అని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజల వద్దకు వెళుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారన్నారు.
Andhrapradesh: నగరంలోని ఎంఆర్‌పల్లి శ్రీనగర్ కాలనీలో దుండగులు రెచ్చిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున కాలనీలోని రిటైర్ ఎస్ఐ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. రిటైర్ ఎస్ఐ భార్యను కత్తితో బెదిరించి బంగారం, వెండిని దోపిడీ చేశారు. ఇంట్లో ఎవ్వరూ లేరని అగంతకులు దొంగతనం కోసం తలుపులు బద్దలు కొట్టారు. అయితే భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న తిలకవతి.. అలికిడి రావడంతో బెడ్ రూం నుండి బయటకు వచ్చింది. ఆమెను చూసిన దుండగులు.. కత్తితో బెదిరించి వంటిపై ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులను అపహరించారు.
తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం.