Home » CM KCR
Telangana Elections: రఘునందన్ రావు గెలిచాక ఏం చేసాడో ప్రజలు చూస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారని.. ఏం చేశారని నిలదీశారు.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా - అల్లుళ్లకు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) మెక్కేసిన నిధులను కక్కిస్తామని ఐఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పేర్కొన్నారు. ఆదివారం నాడు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పదేళ్లుగా బీఆర్ఎస్ ( BRS ) పాలన అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కి ఎద్దు, ఎవుసం అంటే తెల్వదని సీఎం కేసీఆర్ ( CM KCR ) సెటైర్లు వేశారు.
ధరణి పోర్టల్‌తో సీఎం కేసీఆర్ ( CM KCR ) భూమి దొంగలా మారాడని రైతులు తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్ ( Prakash Javadekar ) అన్నారు.
తెలంగాణ రాకుంటే కేసీఆర్ ( KCR ) కుటుంబం నాంపల్లి దర్గా, బిర్లా మందిరం దగ్గర బిచ్చం ఎత్తుకునే వారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సెటైర్లు వేశారు.
తూప్రాన్ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ గెలవలేకే.. ఓటమి భయంతో వేరే చోట పోటీ చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
లక్షల కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు కట్టలు విరజిమ్మి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు.