Ponguleti : ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబం డబ్బు కట్టలు విరజిమ్మి గెలవాలని చూస్తోంది
ABN , First Publish Date - 2023-11-26T17:39:03+05:30 IST
లక్షల కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు కట్టలు విరజిమ్మి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా: లక్షల కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు కట్టలు విరజిమ్మి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు సత్తుపల్లిలోని కందుకూరులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...‘‘ఈ కందుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఏనాడు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడని వ్యక్తి నేడు డబ్బు సంచులతో ఈ ప్రజలను కొనటానికి వచ్చారు’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
‘‘సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి పని కూడా తీసుకురాలేని ఎమ్మెల్యేని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి రాఘమయి గెలవాలి. రాఘమయిని ఓడించేందుకు కేసీఆర్ కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఇది న్యాయమా.. మన ఆడబిడ్డను మనం కాపాడుకోలేమా.. మనం గెలిపించుకోలేమా ఆలోచించండి. సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మట్ట రాగమయిని అఖండ మెజారిటీతో గెలిపించాలి’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి