Prakash Javadekar: ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూమి దొంగలా మారాడు
ABN , First Publish Date - 2023-11-26T20:15:25+05:30 IST
ధరణి పోర్టల్‌తో సీఎం కేసీఆర్ ( CM KCR ) భూమి దొంగలా మారాడని రైతులు తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ ( Prakash Javadekar ) అన్నారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్‌తో సీఎం కేసీఆర్ ( CM KCR ) భూమి దొంగలా మారాడని రైతులు తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ ( Prakash Javadekar ) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలల్లో కేసీఆర్ ఓడిపోతారని.. బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఫలితాలు చూసిన తర్వాత విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతారు. ప్రజలు కేసీఆర్ పాలన ఇక చాలు అనుకుంటున్నారు. దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు ఒకటి, రెండు శాతం మందికి కూడా అందలేదు. డబ్బు లేనందున సంక్షేమ పథకాలు అమలు చేయలేక పోయామని కేటీఆర్ చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వేలాది కోట్లు ఎలా వచ్చాయి. కాంగ్రెస్ లాంటి అపరాధిలను ప్రజలు ఎప్పుడూ క్షమించరు. ఇన్నేళ్ల పాటు కాంగ్రెస్ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజలకు మోదీపై నమ్మకం ఉంది.. మోదీ లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారు’’ అని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి