Home » Congress Govt
ఉగ్రవాదులను పెంచి పోషించేది మజ్లిస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఒవైసీకి చెందిన కాలేజీలో పని చేసిన ఓ ఫ్యాకల్టీని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని గతంలో అరెస్టు చేశారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
‘‘అమృత్ టెండర్ల విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఒక మంత్రి అన్నారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా.
తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా తమకు తెలుస్తుందని చెప్పారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయని , అన్నీ బయట పెడతామని కేటీఆర్ హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీ కోసం భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వేలకోట్ల రూపాయలు పనులను సీఎం రేవంత్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్ నేతలే పంచుతున్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూల్ 250 ప్రకారం పీఏసీ కమిటీని ఎన్నుకోవాలని తమ పార్టీ ఎమ్మెల్యేలం కోరామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు, మండలి నుంచి ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ పేర్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఇచ్చామని చెప్పారు.