Home » Congress
మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో విషాదం అలముకుంది. కర్ణాటకలోని బెళగావిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ తరలివచ్చారు.
ఇంతవరకు ఎదురుకాని పెనుముప్పును భారత రాజ్యాంగం ఎదుర్కొంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల దశాబ్దాల ప్రాజెక్టు అని ధ్వజమెత్తింది.
అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006, ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ప్రారంభించారు.
భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది! కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు!! మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు దృవీకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు.
Telangana: కేంద్రమంత్రి అమిత్‌షాపై మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారతరత్నకు గౌరవం ఇస్తున్నాం అన్నప్పుడు అమిత్ షా అటువంటి వాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీపరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.